ఐవీఎఫ్ లో కవలలు.. డీఎన్ఏ పరీక్షల్లో దంపతులకు షాక్

హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన రాహుల్ రాథోడ్, మీను రాథోడ్ దంపతులు ఐవీఎఫ్ చికిత్స తీసుకున్న తర్వాత (జనవరి 5న) కవల ఆడపిల్లలు జన్మించారు. అయితే, పిల్లల పోలికలు తమతో సరిపోలకపోవడంతో అనుమానంతో డీఎన్ఏ పరీక్షలు చేయించగా, ఆ పిల్లలు తమవారు కాదని తేలింది. వేరే దంపతుల పిండాన్ని పొరపాటున లేదా మోసపూరితంగా గర్భంలో ప్రవేశపెట్టారని దంపతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ జంట కోర్టును ఆశ్రయించింది. ఈ ఆరోపణలపై దర్యాప్తునకు ఢిల్లీ కోర్టు పోలీసులను ఆదేశించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్