TG: ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్ హాస్పిటల్కు చికిత్స కోసం వచ్చిన ఓ గర్భిణి ప్రాణాలు కోల్పోయింది. ఉట్నూరుకు చెందిన ఏడు నెలల గర్భిణి అయిన బి.సునీత కాళ్ల వాపులతో ఈ నెల 21న ఆస్పత్రిలో చేరింది. అయితే చికిత్స పొందుతున్న సమయంలో బీపీ పెరగడంతో తీవ్ర అస్వస్థకు గురై ఆమె మృతి చెందింది. తల్లి మృతి చెందడంతో కడుపులో ఉన్న ఇద్దరు కవల పిల్లలు సైతం తల్లి గర్బంలోనే ప్రాణాలు విడిచారు. వైద్యుల నిర్లక్ష్యమే సునీత మృతికి కారణమని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు.