ట్విష మృతి కేసు.. అత్త గిరిబాలా సింగ్‌ను అరెస్టు చేసిన సీబీఐ

నటి ట్విషా శర్మ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మృతురాలి అత్త గిరిబాలా సింగ్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ట్విషా శర్మ అనుమానాస్పద మృతి దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. విచారణలో భాగంగా పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ గిరిబాలా సింగ్ సహకరించలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భోపాల్‌లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే గిరిబాలా సింగ్ విశ్రాంత న్యాయమూర్తి కావడం గమనార్హం.

సంబంధిత పోస్ట్