సోషల్ మీడియా సెన్సేషన్ అషు రెడ్డిపై నమోదైన మోసం కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. లండన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ను ప్రేమ, పెళ్లి పేరుతో సుమారు రూ.9.5 కోట్లు మోసం చేశారనే ఆరోపణలపై ఆమె తొలిసారి స్పందించారు. తనపై వస్తున్న వార్తలను ఖండిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. తన అనుమతి లేకుండా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజాలు బయటకు రాకముందే తన ప్రతిష్ట దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోనని స్పష్టం చేశారు.