శివసత్తు కేసులో ట్విస్ట్.. లైంగిక వేధింపులు భరించలేకే హత్య

TG: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​ మండలంలో శివసత్తు హత్య కేసు కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే విచారణలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. శివసత్తు సుధాకర్​ మధ్యప్రదేశ్​కు చెందిన ఓ యువకుడిని తరచూ లైంగికంగా వేధించేవాడని తేలింది. అది భరించలేకే ఆ యువకుడు తన స్నేహితుడి సాయంతో హత్య చేసి నగదు, నగలతో పరారైనట్లు గుర్తించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ అక్షాంశ్ ​యాదవ్​ తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕