TG: మేడ్చల్ జిల్లా నరసింహరెడ్డినగర్లో కూలీ డబ్బుల విషయంలో జరిగిన వివాదం స్క్రూడ్రైవర్‌తో దాడికి దారితీసింది. గతంలో టైల్స్ పని చేసిన శివ, అనిల్ అనే ఇద్దరు వ్యక్తులు.. సెప్టెంబర్ 30న రాత్రి హరిచందర్ ఇంటికి వెళ్లి కూలీ డబ్బుల విషయంలో గొడవపడ్డారు. అనంతరం స్క్రూడ్రైవర్‌తో హరిచందర్, ఆయన భార్యపై దాడి చేయడంతో ఇద్దరికీ తలకు గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులు శివ (21), అనిల్ (25)లను అదుపులోకి తీసుకుని అక్టోబర్ 1న రిమాండ్‌కు తరలించారు.