TG: హైదరాబాద్ బండ్లగూడకు చెందిన ఓ బాలిక(15)పై ఇద్దరు ఆటో డ్రైవర్లు లైంగికదాడికి పాల్పడ్డారు. ఓ ఇంట్లో పనిచేస్తున్న బాలిక ఇంటి నుంచి పనికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. ఆటోలో ఉన్న అహ్మద్, అస్లాం బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో చాంద్రాయణగుట్ట పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు.