AP : అల్లూరి జిల్లాలోని డుంబ్రిగుడ మండలంలో, ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గోరాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొక వ్యక్తికి గాయాలయ్యాయి, అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.