TG: నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్–మాచర్ల రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పైలాన్ కాలనీ పాత పోలీస్ స్టేషన్ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఢీకొన్న వాహనాల్లో ఒకటి పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.