AP: కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై డీఐజీ కోయా ప్రవీణ్ కుమార్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా 11 మంది మృతదేహాలను ఇప్పటివరకు గుర్తించామని ఆయన తెలిపారు. బస్సులో సిబ్బందితో కలిపి మొత్తం 43 మంది ఉన్నారని, అందులో 23 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని డీఐజీ చెప్పారు. అంతేకాక, బైక్‌పై వెళ్తున్న వ్యక్తి కూడా చనిపోయారని, అతని డెడ్‌బాడీ రోడ్డు పక్కన ఉందని అన్నారు. ప్రస్తుతం ప్రమాదంపై డ్రైవర్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు డీఐజీ వెల్లడించారు.