TG: ఆర్మూర్‌లోని జీవన్ రెడ్డి మాల్‌లో లిఫ్ట్ సాంకేతిక లోపం కారణంగా ఇద్దరు చిన్నారులు లోపల చిక్కుకున్నారు. లిఫ్ట్ తలుపులు తెరుచుకోకపోవడంతో వారు భయపడ్డారు. కొంతసేపటి తర్వాత సిబ్బంది లిఫ్ట్ తలుపులను తెరిచి, పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ సంఘటనతో మాల్‌లో కొద్దిసేపు కలకలం రేగింది.