ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఫ్రాంచైజీలు కోచ్‌ల నియామకంపై దృష్టి సారించాయి. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త హెడ్ కోచ్‌లను ప్రకటించాయి. తాజాగా, పంజాబ్ కింగ్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్ బ్రాడ్ హాడిన్, బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ రాజీనామా చేశారు. దీంతో పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్‌ల కోసం అన్వేషణ ప్రారంభించింది. రాబోయే సీజన్‌లో జట్టులో గణనీయమైన మార్పులు చేయాలని పంజాబ్ కింగ్స్ యోచిస్తున్నట్లు సమాచారం.