AP: విశాఖలో ఓ యువకుడు హల్ చల్ చేశారు. పోలీస్ స్టేషన్‌లోనే ఇద్దరు కానిస్టేబుళ్లపై కత్తులతో దాడికి పాల్పడ్డాడు. పెదబొడ్డేపల్లికి చెందిన కాళ్ల మణికంఠ రాత్రి ట్రాఫిక్ సిబ్బందితో గొడవపడి రాయితో దాడికి యత్నించాడు. వెంటనే నిందితుడిని పోలీస్ స్టేషన్‌కు తరలించగా స్టేషన్‌లోనే ఇద్దరు కానిస్టేబుళ్లతో గొడవకు దిగాడు. అనంతరం రెండు జేబుల్లో నుంచి కత్తులు తీసి దాడికి ప్రయత్నించాడు. ఈ దాడిలో కానిస్టేబుళ్లకు స్వల్ప గాయాలయ్యాయి.