మైనింగ్ గుంతలో పడి ఇద్దరు మృతి

TG: మైనింగ్ గుంతలో పడి ఇద్దరు మేకల కాపరులు మృతి చెందిన విషాద ఘటన వికారాబాద్ జిల్లా చోటు చేసుకుంది. ధరూర్ మండలం తరిగోపుల గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. మృతులు తరిగోపులకు చెందిన శ్రీనివాస్ (43), అశోక్ (21)గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్ట్​మార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్

✕
✕