పిడుగుపాటుకు ఇద్దరు మహిళా కూలీల మృతి

AP: మన్యం జిల్లా పాలకొండ మండలం వెంకటాపురంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుకు గురై ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందారు. మృతులు రామలక్ష్మమ్మ (50), దుర్గమ్మ (50)గా గుర్తించారు. ఈ విషాద సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. వీరి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

సంబంధిత పోస్ట్

✕
✕