AP: విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఐదు రోజుల వ్యవధిలో ఇద్దరు పీజీ విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నెల 24న జనరల్ మెడిసిన్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని శైలజ పరీక్షల ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోగా, తాజాగా ఈఎన్టీ పీజీ విద్యార్థిని శ్రావణి కూడా చిన్నవాల్తేరులో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.