బీహార్‌లోని పాట్నాలో కుర్జీ బ్రిడ్జి వద్దగల ఒక నగల దుకాణంలో ఇద్దరు అమ్మాయిలు దోపిడీకి ప్రయత్నించారు. షాప్ యజమానిపై పెప్పర్ స్ప్రే కొట్టి, అతన్ని అచేతనుడిని చేసేందుకు యత్నించారు. అయితే, యజమాని చాకచక్యంగా తప్పించుకుని కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. పారిపోవడానికి ప్రయత్నించిన ఆ ఇద్దరు అమ్మాయిలను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.