AP: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ కించూరు గ్రామానికి చెందిన ఇద్దురు బాలికలు చదువులో వెనుకబడినట్లు భావించి కారడవిలోకి పారిపోయారు. ఐదు, ఆరో తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు పాఠశాల నుంచి పరారయ్యి 4 రోజులు కొండ గుహలో దాక్కున్నారు. దుంపలు తింటూ, అక్కడ దొరికే నీరు తాగుతూ గుహలో తలదాచుకున్న వీరిని డ్రోన్ల సహాయంతో పోలీసులు గుర్తించి సోమవారం పట్టుకున్నారు. గ్రామస్థుల సహకారంతో తల్లిదండ్రులకు అప్పగించారు.