ఉరి వేసుకుని భార్యభర్తలు ఆత్మహత్య

TG: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పటేల్ గూడా గ్రామంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వడ్ల బాల సాయి చారి (32), పద్మ (25) దంపతులు ఆదివారం సాయంత్రం ఆర్థిక కారణాలతో ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వీరికి ఐదు నెలల బాబు ఉన్నాడు. మృతుని తమ్ముడు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా, ఇద్దరూ ఉరి వేసుకుని కనిపించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులను కోల్పోయిన ఐదు నెలల చిన్నారి అనాథగా మారాడు.

సంబంధిత పోస్ట్