వైద్యం వికటించి ఇద్దరు బాలింతలు మృతి

AP: వైద్యం వికటించి ఇద్దరు బాలింతలు మృతిచెందిన సంఘటన శ్రీకాకుళంలో బుధవారం చోటు చేసుకుంది. కామేశ్వరరావుపేటకు చెందిన పట్ట అరుణ(21), పాగోడుకు చెందిన కొర్లాపు ధనలక్ష్మి(22)కి పురిటినొప్పులు రావడంతో ఈ నెల 7న బుడితి సీహెచ్‌సీలో చేర్పించారు. మగ శిశువులను కన్న వారిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అదే రోజు రాత్రి వారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించి మంగళవారం వారు మృతిచెందారు. కుటుంబ సభ్యులు బుధవారం ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్