ఢిల్లీలో భవనం కూలిన ఘటనలో ఇద్దరు మృతి

ఢిల్లీలోని సీలంపూర్‌లో శనివారం ఉదయం నాలుగంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 8 మందికి గాయాలు అయ్యాయి. ఇంకా పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తోంది. అగ్నిమాపక, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. ఉదయం 7 గంటల సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని, క్షణాల్లో దట్టమైన దుమ్ము వ్యాపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భవనంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది ఉండే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్