తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకల సమయంలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం సాయంత్రం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురానికి చెందిన యలగాల భారతి (55) బతుకమ్మ ఆడుతుండగా డీజే శబ్దాల మధ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అలాగే, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బాబాసాగర్కు చెందిన శ్రీవాణి (25) కూడా బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటుండగా కుప్పకూలి మరణించారు.