ఆక్సిజన్ సిలిండర్ పేలి ఇద్దరు మృతి

శనివారం అర్ధరాత్రి రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని విశ్వకర్మ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ఆక్సిజన్ బాటిలింగ్ ప్లాంట్‌లో సిలిండర్లు నింపుతున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఫ్యాక్టరీ మేనేజర్ వినోద్ గుప్తా (45)తో పాటు మున్నా రాయ్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో కార్మికుడు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ షెడ్డు ధ్వంసమై, పక్కనే ఉన్న గోడ కూలిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్