ట్రాక్టర్‌ పైనుంచి పడి .. ఇద్దరు కూలీలు దుర్మరణం

TG: వరంగల్(D) పర్వతగిరి (M)లోని పంచరాయి తండాలో విషాదం చోటుచేసుకుంది. పనికి వెళ్తూ ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఎస్సై బి.ప్రవీణ్ కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని పంచరాయి తండాకు చెందిన బానోతు రాములు(57), బానోతు హర్లా (48) శుక్రవారం ట్రాక్టర్ పై మొక్కజొన్న మిషన్ తో పనికి వెళ్తున్నారు. మిషన్ పై వీరిలిద్దరు కూర్చోని వెళ్తుండగా కింద పడిపోయి హర్లా అక్కడికక్కడే మృతి చెందగా.. చికిత్స పొందుతూ రాములు మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్