TG: కొత్త పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో రెండు లక్షల మందికి చేయూత పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు ఇటీవల మంత్రి సీతక్క అసెంబ్లీలో ప్రకటించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందుతుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో లబ్దిదారులు కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఆమోదం తెలపనున్నారు. జూన్ 2వ తేదీ నుంచి కొత్తగా రెండు లక్షల మందికి పెన్షన్లు పంపిణీ ప్రారంభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం.