ఒకేరోజు రెండు మ్యాచ్‌లు.. బీసీసీఐ నిర్ణయంపై ఉత్కంఠ

భారత పురుషుల క్రికెట్ జట్టు అక్టోబర్ 3న ఒకేరోజు రెండు వేర్వేరు దేశాల్లో మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ఆసియా క్రీడల ఫైనల్ జపాన్‌లో, వెస్టిండీస్‌తో మూడో వన్డే చండీగఢ్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ రెండు జట్లను పంపుతుందా లేక షెడ్యూల్‌ను మారుస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో 1998 సెప్టెంబర్ 12న కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. అప్పుడు భారత జట్టు కౌలాలంపూర్‌లో కామన్వెల్త్ గేమ్స్‌లో కెనడాపై, టొరంటోలో ఫ్రెండ్‌షిప్ కప్‌లో పాకిస్థాన్‌పై గెలిచింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕