ఫుకెట్-ఢిల్లీ విమాన ఘటన తర్వాత ఎయిర్ ఇండియా చేపట్టిన డ్రగ్స్ పరీక్షల్లో మరో ఇద్దరు పైలట్లు ప్రాథమిక పరీక్షలో విఫలమైనట్లు సమాచారం. తుది పరీక్ష ఫలితాలు రావాల్సి ఉండగా, అప్పటివరకు వారిని డీ-రోస్టర్ చేసినట్లు తెలుస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పటివరకు 300 మందికి పైగా పైలట్లకు పరీక్షలు నిర్వహించారు. సాధారణంగా తుది పరీక్ష ఫలితాలు 24–48 గంటల్లో వస్తాయని అధికారులు తెలిపారు. గత ఘటనలో పైలట్ పరీక్షల్లో గంజాయి ఆనవాళ్లు గుర్తించడంతో ఎయిర్ ఇండియా అన్ని పైలట్లకు డ్రగ్ టెస్టులు నిర్వహిస్తోంది.