బస్సు లగేజీ క్యాబిన్‌లో మరో రెండు మృతదేహాలు.. ఇంతకీ ఎవరివి?

AP: కర్నూలు బస్సు ప్రమాదం ఘటనలో మరో విషయం వెలుగులోకి వచ్చింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు మంటల్లో దగ్ధమైన తర్వాత, బస్సు లగేజీ క్యాబిన్‌లో కూడా రెండు మృతదేహాలను గుర్తించారు. ఇంతకు ఆ మృతదేహాలు ఎవరివి..? అనే విషయం తెలియరాలేదు. "ఇంతకీ క్యాబిన్‌లో మృతదేహాలు ఎక్కడి నుంచి వచ్చాయి?. అక్రమంగా ఓనర్‌కి తెలియకుండా దొడ్డిదారిన డబ్బులు తీసుకుని ఈ ఇద్దరు ప్రయాణికులకు క్యాబిన్‌లో చోటు కల్పించారా?" అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్