TG: రాష్ట్రంలో వరుస బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇవాళ ఉదయం 5గం.కు కరీంనగర్ తిమ్మాపూర్ మండలం రేణికుంట వద్ద మెట్ పల్లి డిపో ఆర్టీసీ బస్సు ఓ ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. అలాగే నల్గొండ జిల్లా బుగ్గబావిగూడెం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ ను ఢీకొట్టగా, అందులోని నలుగురికి గాయాలయ్యాయి. ఈ రెండు సంఘటనలు ఈరోజు తెల్లవారుజామున జరిగాయి.