TG: రాజ్‌భవన్‌లో అజాహరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కేబినేట్‌లో మరో రెండు మంత్రుల పదవులు ఖాళీగా ఉండగా... త్వరలో వాటిని కూడా ప్రకటిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా వెల్లడించారు. దీంతో కొత్త మంత్రుల ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఓసీ, బీసీ వర్గాలకు చోటు దక్కే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే మంత్రి పదవి ఎవరికి దక్కుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.