ప్రపంచంలోనే తొలిసారిగా రెండు సరికొత్త జన్యుసవరణ వరి రకాలను భారత్‌కు చెందిన ICMR శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. క్రిస్పర్– కాస్9 అనే సరికొత్త జీనోమ్–ఎడిటింగ్(GE) టెక్నాలజీతో వీటిని రూపొందించారు. పూసా రైస్ డిఎస్‌టి1 అనే రకం కరువును, చౌడును తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది. డీఆర్‌ఆర్ ధన్ 100 (కమల) అనే వరి సైతం అధిక దిగుబడినిస్తుంది. ఈ రెండు జన్యు సవరణ వంగడాలు రైతులకు అందడానికి నాలుగేళ్లు పట్టొచ్చు.