అమెరికాలోని కాలిఫోర్నియాలో 'స్కైడైవ్ ఎల్సినోర్' సంస్థ నిర్వహించిన స్కైడైవింగ్ కార్యక్రమంలో ఘోర ప్రమాదం జరిగింది. సుమారు 150 అడుగుల ఎత్తులో ల్యాండింగ్‌కు సిద్ధమవుతుండగా, ఇద్దరు అనుభవజ్ఞులైన స్కైడైవర్ల పారాచూట్లు ఒకదానికొకటి ఢీకొని చిక్కుకుపోయాయి. తీవ్రంగా గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతులు ఇద్దరూ లైసెన్స్ కలిగిన వారేనని, పరికరాల్లో ఎటువంటి లోపాలు లేవని సంస్థ పేర్కొంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.