శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణికులు ఎయిర్‌హోస్టెస్‌లను వేధించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్ నుండి వచ్చిన ఇండిగో విమానంలో రమేష్ అనే వ్యక్తి ఎయిర్‌హోస్టెస్‌ను అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించగా, ఫిర్యాదుతో సీఐఎస్ఎఫ్ అతడిని అదుపులోకి తీసుకుంది. మరోవైపు, ఢిల్లీ నుండి వచ్చిన ఇండిగో విమానంలో నాజర్ అనే వ్యక్తి మత్తులో ఎయిర్‌హోస్టెస్‌ను అసభ్యకరమైన మాటలతో వేధించడంతో.. విమానం దిగగానే పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.