కాంగో నుంచి ఆగ్రాకు వచ్చిన ఇద్దరికి ఎబోలా వైరస్ పాజిటివ్‌గా తేలడంతో ఉత్తరప్రదేశ్‌లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ, ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిర్వహించిన స్క్రీనింగ్‌లో వారి నమూనాల్లో వైరస్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇద్దరితో పాటు వారి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌లో ఉంచి వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ప్రస్తుతం వారికి సాధారణ లక్షణాలు మాత్రమే ఉన్నాయని, ఎలాంటి తీవ్రమైన ప్రభావం లేదని అధికారులు వెల్లడించారు.