TG: సిద్దిపేట (D) అక్బర్పేట భూంపల్లి(M) రుద్రారం గ్రామంలోని పెద్ద చెరువులో శనివారం వినాయక నిమజ్జనానికి వెళ్లి ఇద్దరు వ్యక్తులు గల్లంతైన విషయం తెలిసిందే. సమాచారం మేరకు వచ్చిన పోలీసు సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మేరకు గల్లంతైన పారా రమేష్(38), కలాల నవీన్ (26) ల మృతదేహాలను ఆదివారం ఉదయం గుర్తించి బయటకు తీశారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.