రన్‌వేపై రెండు విమానాలు ఢీ.. భయాందోళనలో ప్రయాణికులు (వీడియో)

జపాన్‌లోని టోక్యో హనెడా విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అయిన జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌బస్‌ ఏ350ను జపాన్‌ కోస్ట్‌గార్డ్‌కు చెందిన డాష్‌-8 విమానం రన్‌వేపై ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత ఏ350లో పొగలు వ్యాపించగా, ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అనంతరం అత్యవసర స్లైడ్లు తెరిచి ప్రయాణికులను బయటకు తరలించారు. ఈ ఘటనలో ఏ350లో ఉన్న 367 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇది ఎయిర్‌బస్‌ ఏ350కు సంబంధించిన తొలి ప్రమాదం అని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕