తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నైలోని పల్లికరణైలో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు మద్యం సేవించి కేటీఎం బైక్‌పై వెళ్తుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, మృతులు చెన్నైకి చెందిన గోకుల్ (24), కేరళకు చెందిన విష్ణు (24) అనే ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పోలీసులు గుర్తించారు.