TG: సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో విషాదం చోటు చేసుకుంది. ముకుందాపురం ముక్త్యాల బ్రాంచ్ కెనాల్లో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. అనుదీప్, హరీశ్నాయుడు, స్వరూప్ అనే ముగ్గురు విద్యార్థులు కెనాల్లో ఈతకు వెళ్లి కాలువలో కొట్టుకుపోయారు. వీరిలో అనుదీప్ అనే విద్యార్థిని స్థానికులు కాపాడగా హరీశ్నాయుడు, స్వరూప్ చనిపోయారు.