ఒకే యువతిని ప్రేమించిన ఇద్దరు విద్యార్థులు.. ఒకరు హత్య

చెన్నైలో ట్రయాంగిల్ లవ్ కారణంగా ఒక స్నేహితుడు బలైపోయాడు. చంద్రు, వెంకటేశన్ అనే ఇద్దరు విద్యార్థులు ఒకే యువతిని ప్రేమిస్తున్నారు. అందులో ఒక ప్రేమికుడు చంద్రు.. ప్రత్యర్థి వర్గానికి చెందిన వారిని బెదిరించాలని డీఎంకే కౌన్సిలర్ మనవడు సహాయం కోరాడు. దీంతో సోమవారం వారు కారులో బయలుదేరి.. ప్రత్యర్థి వర్గం రెండు బైక్‌లపై వెళ్తుండగా వారిని కారుతో వెనుకనుండి ఢీకొట్టారు. ఈ ఘటనలో ప్రత్యర్థి ప్రేమికుడు వెంకటేశన్ స్నేహితుడు నితిన్ సాయి(19) తలకు తీవ్ర గాయాలై ప్రాణాలు కోల్పోయాడు.

సంబంధిత పోస్ట్