ఉధంపూర్‌లో ఇద్దరు తీవ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్ లోని ఉధంపూర్ జిల్లా బంసంత్‌ఘర్ ప్రాంతంలో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. వీరిలో జైషే మహ్మద్ టాప్ కమాండర్ మావి అలియాస్ మావియా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, అటవీ ప్రాంతంలోని గుహలో దాక్కున్న తీవ్రవాదులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. మరో తీవ్రవాది వివరాలు తెలియాల్సి  ఉండగా, సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్