మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో గురువారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చిక్లియా క్రాసింగ్ వద్ద రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోల్ పంప్ సమీపంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.