జీఎస్టీ తగ్గింపుతో భారీగా పెరిగిన టూవీలర్ అమ్మకాలు

సెప్టెంబర్​లో జీఎస్టీ రేట్ల తగ్గింపు, పండుగల డిమాండ్​తో వాహనాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) వెల్లడించింది. ప్యాసింజర్​ వెహికల్స్​ డిస్పాచ్​లు 4 శాతం పెరిగి 3,72,458 యూనిట్లకు, టూవీలర్​ సేల్స్​ 7 శాతం పెరిగి 21,60,889 యూనిట్లకు, త్రీవీలర్​ డిస్పాచ్​లు 5.5 శాతం వృద్ధితో 84,077 యూనిట్లకు చేరాయి. సెప్టెంబర్​ 22 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త జీఎస్​టీ రేట్ల ప్రభావంతో కేవలం 9 రోజుల్లోనే అమ్మకాలు రికార్డుస్థాయిలో పెరిగాయని సియామ్​ ప్రెసిడెంట్​ శైలేష్​ చంద్ర తెలిపారు.

సంబంధిత పోస్ట్