కత్తితో దాడి చేసిన అల్లుడు.. ఇద్దరు మహిళలు మృతి

TG: హైదరాబాద్ శివారులోని మీర్‌పేట్ జయశ్రీ కాలనీలో కుటుంబ కలహాల కారణంగా దారుణం జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఓ వ్యక్తి తన అత్తింటిపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అత్త నిరంజన్ బీ, బావమరిది భార్య రేష్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిందితుడి భార్య, కుమార్తె, బావమరిది యూసుఫ్ తీవ్రంగా గాయపడగా, వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఉదయమే ఫిర్యాదు చేసినా స్పందించలేదని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕