చేపల వేటకు వెళ్లి ఇద్దరు కార్మికులు మృతి (వీడియో)

AP: శ్రీసత్యసాయి జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పెనుకొండ మండలం అడదాకులపల్లిలో ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు మృతి చెందారు. చెరువులో చేపల వేటకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. మృతులు కర్ణాటకకు చెందిన లక్ష్మణమూర్తి, మల్లికార్జునగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕