TG: ఇనుపగేటు మీద పడి రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదం నింపింది. యూపీకి చెందిన వీరేంద్ర శర్మ HYD మియాపూర్లో ఫాబ్రికేషన్ పనులు చేస్తుంటారు. ఆయనను చూసేందుకు రెండు రోజుల క్రితం భార్యపిల్లలు హైదరాబాద్ వచ్చారు. ఈ క్రమంలో వీరేంద్ర కుమారుడు అడుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఇనుపగేటు మీద పడింది. తీవ్రగాయాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు.