స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల బాలుడు మృతి

TG: యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లాకేంద్రం సమీపంలోని వడపర్తిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. తల్లి తన పెద్ద కుమారుడిని తీసుకురావడానికి స్కూల్ బస్సు వద్దకు వెళ్ళగా, అన్న కోసం ఆ బాలుడు కూడా ఆమె వెంట వెళ్ళాడు. డ్రైవర్ గమనించకుండా బస్సును కదిలించడంతో, టైర్ కింద పడి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్