AP: పల్నాడు జిల్లా ఈపూరు మండలం బొగ్గరం గ్రామంలో రేబిస్ లక్షణాలతో రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇంటి బయట పడిపోవడంతో బాలుడి ముఖానికి చిన్న గాయం కాగా.. ఆ గాయాన్ని కుక్క నాకినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఘటన జరిగిన సమయంలో తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించలేదు. ఈ నెల 22న బాలుడి ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. భయంతో కేకలు వేయడంతో పాటు నీళ్లు తాగకుండా వెక్కిళ్లు రావడంతో నరసరావుపేటలోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రేబిస్ సోకినట్లు గుర్తించి మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అదే రోజు సోహాన్ రుద్రాన్ష్ (2) మృతి చెందాడు.