హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోమన్ హోటల్ ఎదురుగా నిలిపి ఉన్న ఆటోలో జహంగీర్ (24), ఇర్ఫాన్ (25) అనే ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మాదకద్రవ్యాలు అధిక మోతాదులో తీసుకోవడం మరణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనా స్థలంలో మూడు ఇంజెక్షన్లు, సిరంజీలు లభ్యం కాగా, మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.