ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ వ్యాధి తీవ్రత పెరుగుతోంది. కృష్ణా జిల్లాలో 44 ఏళ్ల శివశంకర్ అనే వ్యక్తి మరణించడంతో, ఈ వ్యాధితో మరణించిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. డిసెంబర్ 6న శివశంకర్ స్క్రబ్ టైఫస్‌తో మరణించినట్లు నిర్ధారణ అయింది. వ్యాధి వ్యాప్తి చెందకుండా నివారించడానికి మొదునూరు గ్రామంలో వైద్య బృందం సర్వే చేపట్టింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.