అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2లో అఫ్గానిస్థాన్ జట్టు భారత్ ముందు 311 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఫైజల్ షినోజాదా 110 పరుగులు, ఉజైరుల్లా 101 పరుగులు చేసి శతకాలు సాధించారు. భారత బౌలర్లలో దీపేశ్ 2 వికెట్లు, కనిష్క్ 2 వికెట్లు తీశారు.